Share News

TDP MLA: జగన్‌ నువ్వు మారవా.. టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:01 AM

TDP MLA Venkataprasad : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని అన్నారు.

 TDP MLA: జగన్‌ నువ్వు మారవా.. టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్
TDP MLA Venkataprasad

శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జీవితంలో ఇక మారడని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. పాపిరెడ్డి పల్లెలో ఆవేశంలో జరిగిన హత్యకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషపూరితమైన ఆలోచనలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్పారు.


వెనుకబడిన వర్గాల మీద దాడి అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన సఫలీకృతం కాదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. నడిరోడ్డులో దారుణంగా చంపిన ఘటనలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయని గుర్తుచేశారు. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘనత జగన్‌దేనని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ప్రజలు ఊరుకోరని జగన్మోహన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శలు చేశారు.


శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఇవాళ (శుక్రవారం) ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు. వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అద్దంలో ముఖం చూసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా కంటక పాలన అందించడంతో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆక్షేపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన

ఫోటోషూట్లలోనే ఇదో కొత్త తరహా..

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 11:19 AM