Share News

hill ఆకట్టుకొంటున్న కంబలరాయుని కొండ

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:51 PM

మండలంలోని గొడ్డివెలగల పంచాయతీలో ఉన్న కంబలరాయుని కొండ ఆకర్షిస్తోంది. సాధారణంగా కొండలంటే చెట్లు, రాళ్లతో కనిపిస్తాయి. అయితే ఈ కొండ మాత్రం ఒకే రాయితో అర్ధచంద్రాకారంలో ఉంది

hill ఆకట్టుకొంటున్న కంబలరాయుని కొండ
కంబలరాయుని కొండ

గాండ్లపెంట, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి) : మండలంలోని గొడ్డివెలగల పంచాయతీలో ఉన్న కంబలరాయుని కొండ ఆకర్షిస్తోంది. సాధారణంగా కొండలంటే చెట్లు, రాళ్లతో కనిపిస్తాయి. అయితే ఈ కొండ మాత్రం ఒకే రాయితో అర్ధచంద్రాకారంలో ఉంది. కొండపైన సమాంతరంగా దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం ఉంది. వర్షాలు కురిసినప్పుడు ఆ కొండపై నుంచి కిందికి పారే నీటితో రాతిపై ఏర్పడిన కోతలు స్పష్టంగా కనిపిస్తాయి. కొండ కింద ప్రాంతం అంతా పచ్చదనంతో ఉండడం విశేషం. వర్షాకాలంలో కొండచుట్టు పచ్చదనంతో కలకలాడుతూ చూపరులను మరింత ఆకట్టుకుంటుంది. ఈ కొండపైకి ఎక్కితే తలుపులు, గాండ్లపెంట మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ కొండ ప్రాంతం నుంచి కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు గుహ ఉండేదని పూర్వీకులు చెబుతున్నారు. ప్రతి సంక్రాంతికి ఆ ప్రాంతంలో కంబలరాయుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కొండపైన వెలసిన కంబలరాయునికి గుడి నిర్మించాలని, ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చుట్టుపక్కల గ్రామాలవారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:51 PM