MLA KANDIKUNTA: రాష్ట్ర బడ్జెట్ వైసీపీకి చెంపపెట్టు
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:18 AM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ జగనమోహనరెడ్డికి, ఆయన బృందానికి, వైసీపీకి చెంపపెట్టని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కదిరి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ జగనమోహనరెడ్డికి, ఆయన బృందానికి, వైసీపీకి చెంపపెట్టని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరమే అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి తల్లి వందనం ఇస్తున్నట్లు చెప్పారు. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ రూ.9000 కోట్లు కేటాయించారని అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దీన్ని కూడా ఓర్వలేక విమర్శిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు కేటాయించారో ముందు తెలపాలన్నారు. ఎన్నిసంవత్సరాలు ఇచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. నియోజకవర్గంలో జలజీవన మిషన కింద రూ.26 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. గాండ్లపెంటకు హాంద్రీనీవా నీటిని తీసుకరావడానికి రూ.46 కోట్లతో జీవో మంజూరు చేయించమన్నారు. మరో క్యాంటీనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రణాళికలు పంపమని సూచించినట్లు తెలిపారు. తిరువీధులు అండర్ గ్రౌండ్ విద్యుత కేబుల్ వేయడానికి అన్ని అనుమతులు మంజూరు అయ్యాయని అన్నారు.
ఫించన్ల పంపిణీ: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత పింఛన్లు ఎమ్మెల్యే శనివారం పట్టణంలో 29, 30 వార్డుల్లో పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తోందన్నారు. మన్సిపల్ కమిషనర్ కిరణ్, నాయకులు మేకల రమణ, కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా, డైమండ్ ఇర్ఫాన, నాగప్ప, దాదెం రాజశేఖర్‌రెడ్డి, గంగారత్నమ్మ, పీట్ల రమణమ్మ పాల్గొన్నారు.