Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

ABN, Publish Date - Apr 04 , 2025 | 11:30 AM

Borugadda Anil: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అనంత త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అనిల్‌పై కేసు నమోదు అయ్యింది.

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Borugadda Anil

అనంతపురం, ఏప్రిల్ 4: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను (Borugadda Anil) జిల్లాకు తీసుకువచ్చిన పోలీసులు... అనంతపురం కోర్టులో హాజరుపర్చారు. 2018లో అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనిల్‌పై సీఆర్‌ నెంబర్ 156/2018 u/s 419 186 506 IPC కింద కేసు నమోదు అయ్యింది. ఇప్పటి వరకు అనిల్ వాయిదాలకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురానికి తరలించారు. 2018లో అనంతపురం చర్చి విషయంలో ఐపీఎస్‌ అధికారినంటూ అప్పటి సీఐ మురళీకృష్ణను ఫోన్‌లో బెదిరించాడు బోరుగడ్డ అనిల్. రామచంద్రనగర్‌లోని చర్చ్ విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ సీఐ మురళీకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ కేసులో ఈరోజు (శుక్రవారం) ఉదయం బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం త్రీ టౌన్ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.


2018లో ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అంటూ అప్పటి త్రిటౌన్ సీఐ మురళీ కృష్ణను బెదిరింపులకు గురిచేశాడు బోరుగడ్డ అనిల్. రామచంద్రనగర్‌లో ఓ చర్చ్ విషయంలో కానుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. రెండు వర్గాలకు సంబంధించిన వారు అనంతపురం త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేసన్‌లో తిమోతి వర్గానికి సహకరించాలంటూ.. తనను తాను ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అంటూ అప్పటి సీఐ మురళీకృష్ణకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు బోరుగడ్డ అనిల్. తాను చెప్పినట్లుగా నడుచుకోవాలని, తన వర్గానికి కానుకల విషయంలో సహకరించాలని బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై అప్పటి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌ సీఐగా ఉన్న మురళీ కృష్ణ.. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బోరుగడ్డ అనిల్ పేరుతో ఫోన్‌లో బెదిరింపులకు గురిచేశారంటూ రెండు నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్ డేటాను ఇచ్చి ఫిర్యాదు చేశారు.

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత


దీనిపై అప్పటి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షనల్ కింద బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా హాజరైన అనిల్.. తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. దీంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న బోరుగడ్డను అనంతపురం కోర్టులో హాజరుపర్చాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అనంతపురం త్రీటౌన్ పోలీసులు.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లి ఈరోజు తెల్లవారుజామున బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆపై అనంతపురం కోర్టులో హాజరుపర్చారు. అనిల్‌పై పీటీ వారెంట్ వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనంతపురం ఫోర్‌టౌన్ పోలీసులు కూడా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పైన విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని.. ఫేక్ డాక్యుమెంట్లతో మధ్యంతర బెయిల్ తీసుకున్నారంటూ అంటూ ఫోర్‌టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.


ఇవి కూడా చదవండి

Tirumala: తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎలా కొలువయ్యారంటే..

Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:59 PM