DISCOMS: పబ్లిక్ ఇష్యూలోకి ఇంధన సంస్థలు
ABN, Publish Date - Mar 14 , 2025 | 04:15 AM
అప్పుల భారం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ఇంధన సంస్థలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) విధానం అమరావతి, మార్చి లోకి వెళ్లేందుకు సిద్థమవుతున్నాయి. భవిష్యత్తు విస్తరణ దిశగా కొత్త ప్రణాళికలను చేపట్టేందుకు ఆర్థిక సంస్థల నుంచి అధికవడ్డీలకు రుణాలను ఈ సంస్థలు తీసుకుంటున్నాయి.

ప్రజలకు షేర్ల విక్రయంపై పరిశీలన
ఐపీవోలోకి మారాలని డిస్కమ్లకు కేంద్రం సూచన
ప్రజలనుంచే నిధులు ేసకరించేందుకు వీలు
దీనికోసం ఏర్పాటుచేసిన కమిటీలో ఏపీకి సభ్యత్వం
త్వరలో మార్గదర్శకాలు విడుదల
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అప్పుల భారం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ఇంధన సంస్థలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) విధానం అమరావతి, మార్చి లోకి వెళ్లేందుకు సిద్థమవుతున్నాయి. భవిష్యత్తు విస్తరణ దిశగా కొత్త ప్రణాళికలను చేపట్టేందుకు ఆర్థిక సంస్థల నుంచి అధికవడ్డీలకు రుణాలను ఈ సంస్థలు తీసుకుంటున్నాయి. ఈ రుణాలకు వడ్డీలను కూడా చెల్లించలేక దివాలా తీస్తున్నాయి. ఈ రుణ భారం నుంచి బయటపడేందుకు యావరేజ్ రెవెన్యూ రికే్ౖవర్లో (ఏఆర్‌ఆర్) చార్జీల మోత మోగీస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటిని నిరోధించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం నడుం బిగీంచింది. ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం కాకుండా... ప్రజలకు షేర్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ఇందన సంస్థలకు సూచించింది. కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలులు (డిస్కమ్), జెన్కో, ట్రాన్స్కోలు ‘ఐపీవోలోకి వెళ్లడంపై సమాలోచనలు చేస్తున్నాయి.
రెండుసార్లు కమిటీ భేటీ
విద్యుత్తు రంగంలో సంస్కరణలకు ఆద్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి పేరు ఉంది. సీఎం దృష్టికి ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఐపీఓ విధాన అంశం తీసుకెళ్లింది. ఇందన రంగంలో నాలుగో తరం సంస్కరణల అమలు దిశగా కేంద్రం అడుగులు వేగంగా వేస్తోంది. దీనికోసం కేంద్ర ఇందన, పునరుద్చాక ఇందన వనరుల శాఖ సహాయమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన దీనిపై కమిటీని వేసింది. ఈ కమిటీకి ఉత్తరప్రదేశ్ ఇంధనశాఖ మంత్రి కన్వీనరుగా వ్యవహరిస్తుండగా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇందనశాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే ఈ కమిటీ రెండు సార్లు సమావేశమైంది. ఈ కమిటీ రాష్ర్టాల ఇంధన సంస్థల అప్పులపై అధ్యయనం చేస్తుంది. తీసుకున్న రుణాలన్నీ ఉత్పాదకత కోసం వ్యయం చేశారాలేదా అనే అంశాన్ని సమీక్షిస్తుంది. అప్పుల ఊబి నుంచి బయటపడటంపై విద్యుత్తు సం స్థలకు సలహాలు, సూచనలు ఇస్తుంది. రాష్ర్టాల విద్యుత్తు సంస్థల పెట్టుబడులప్రణాళిక, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక అంశాలపైనా, ఈక్విటీ మెకానిజంలోకి ప్రభుత్వాలు వెళ్లడంపైనా సూచనలు చేస్తుంది.
ఆర్థిక సంస్థల వద్దకు వద్దు..
కేంద్ర ఇంధన, పునరుద్వాక ఇంధన వనరుల శాఖ సహాయమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన గత శనివారం వీడియో కాన్ఫరెన్స్ జరిగీంది. ఈ సమావేశంలో రాష్ర్టాల విద్యుత్తు సంస్థలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ఐపీవోలోకి వెళ్లడంపై మార్గదర్శకాలు విడుదల చేసా చిమని ఖట్టర్ వివరించారు. డిస్కమ్లు నేరుగా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు కేంద్రం విముఖత చూపుతోంది. ఈ నేపధ్యంలో ప్రజల నుంచి షేర్లు రాబట్టడమే ఉత్తమమని భావిస్తోంది.
ఇవీ ఉపయోగాలు..
ప్రజల నుంచి నిధులు సమీకరించడంవల్ల వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
లాభాలు సాధిేస్త, వాటాదారులకు డివిడెండ్లను విద్యుత్ సంస్థలు ఇస్తాయి.
విద్యుత్తు సంస్థలు పూర్తిగా వ్యాపారంలోకి అడుగు పెడతాయి.
విద్యుత్తు చార్జీల వసూలు పారదర్శకంగా ఉంటుంది.
Updated Date - Mar 14 , 2025 | 04:15 AM