Share News

CPS Decision Demand: సీపీఎస్‌పై తుది నిర్ణయం తీసుకోండి

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:19 AM

సీపీఎస్‌ రద్దుపై మంగళవారం కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. 20 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు

CPS Decision Demand: సీపీఎస్‌పై తుది నిర్ణయం తీసుకోండి

  • ప్రభుత్వానికి ఏపీ సీపీఎస్‌ఈఏ విజ్ఞప్తి

విజయవాడ(విద్యాధరపురం), ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల విషయమై మంగళవారం జరగనున్న మంత్రి మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీ సీపీఎస్‌ఈఏ) నాయకులు కోరారు. 20 ఏళ్లుగా సీపీఎస్‌ ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేసి వారి ఆకాంక్షలు నెరవేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌, కడిమి రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే ఏడాది లోపల 4 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయని వారు గుర్తు చేశారు. ఏడాది గడిచిపోయిందని గుర్తుచేస్తూ ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Updated Date - Apr 15 , 2025 | 05:19 AM