ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Salaries : కార్పొరేషన్ల చైర్మన్లకు జీతాలు ఖరారు

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:10 AM

రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌ చైర్మన్ల జీతాలు, అలవెన్సులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

  • ఏ కేటగిరి చైర్మన్‌కు రూ.2,77,500, బీ కేటగిరికి 1,93,500

అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌ చైర్మన్ల జీతాలు, అలవెన్సులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేటగిరి - ఏ, కేటగిరి - బీ చైర్మన్లకు జీతాలను పెంచింది. కేటగిరి ఏ కార్పొరేషన్‌కు చెందిన చైర్మన్‌కు రూ.1.25 లక్షల జీతంగా నిర్ణయింది. కేటగిరి బీ కార్పొరేషన్‌కు చెందిన చైర్మన్లకు రూ.60 వేలు జీతంగా ప్రకటించింది. వ్యక్తిగత సిబ్బంది జీతాలు, కారు అలవెన్సు, ఇల్లు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, ట్రావెల్‌ అలవెన్సు మొత్తం కలుపుకొని కేటగిరి ఏ కార్పొరేషన్‌ చైర్మన్‌కు రూ.2,77,500, కేటగిరి బీ కార్పొరేషన్‌ చైర్మన్‌కు రూ.1,93,500లుగా నిర్ణయించింది. కేటగిరి ఏ కింద 34 కార్పొరేషన్లు, కేటగిరి బీ కింద 28 కార్పొరేషన్లు ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురే‌ష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 12 , 2025 | 05:10 AM