Separate Science Marks: సైన్స్ మార్కులు విడివిడిగా ప్రకటించాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:16 AM
పదో తరగతి ఫలితాల్లో ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు విడిగా మార్కులు ఇవ్వాలని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు

అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేర్వేరుగా మార్కులు ప్రకటించాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. వేర్వేరుగా ఫలితాలు ప్రకటించడంవల్ల విద్యార్థులకు వారి సామర్థ్యం ఏ సబ్జెక్టులో బాగుందో తెలుసుకునే అవకాశం కలగుతుందన్నారు. పరీక్షలు, మూల్యాంకనం వేర్వేరుగా ఉన్నందున మార్కులు కూడా విడివిడిగా ప్రకటించాలని కోరారు.