Aqua farmers protest: సిండికేట్ దోపిడీకి చెక్ పెడతాం
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:59 AM
పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో జరిగిన మహాసభలో ఆక్వా రైతులు సిండికేట్ దోపిడీపై భగ్గుమన్నారు. రొయ్య ధరలు కృత్రిమంగా తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నారని రాస్తారోకో నిర్వహించారు.

ట్రంప్ సుంకాల పేరుతో ధర తగ్గించేశారు
జూలై నుంచి క్రాప్ హాలిడే
పాటిస్తాం: ఆక్వా రైతులు
పాలకొల్లు రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రొయ్య పిల్లలు విక్రయించే హేచరీల నుంచి, మేత కంపెనీలు, కొనుగోలుదారులు.. అంతా సిండికేట్ అయి ఆక్వా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆక్వా రైతులు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో సోమవారం ఆక్వా రైతుల మహాసభ జరిగింది. అనంతరం పూలపల్లి వైజంక్షన్‌లో రైతులంతా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, పలువురు రైతులు మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాన్ని ఆసరాగా తీసుకొని కొనుగోలు కేంద్రాలు రొయ్యల ధరను అడ్డగోలుగా తగ్గించేశాయని మండిపడ్డారు. అమెరికాలో 50-40 కౌంటు రొయ్యలకు మాత్రమే సుంకం విధిస్తే ఇక్కడ వేరే దేశాలకు వెళ్లే 100 కౌంటు రొయ్యలకు కూడా ధర తగ్గించి కొంటున్నారని వాపోయారు. కేంద్రం రా మెటీరియల్ ధరలు తగ్గించినా కంపెనీలు మాత్రం ధరలు తగ్గించలేదన్నారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో జూలై నుంచి మూడు నెలలపాటు క్రాప్ హాలిడే పాటించాలని, సిండికేట్ దోపిడీకి చెక్ పెట్టేలా ఉద్యమించాలని తీర్మానించారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..