Asha Hospital Services Stop: నేటి నుంచి వైద్యం బంద్
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:42 AM
ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆశా ప్రకటించింది. రూ.3500 కోట్ల బకాయిలు వలన ఆర్థిక భారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది

నెట్‌వర్క్ ఆస్పత్రులు మరోసారి లేఖ
అమరావతి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): బకాయిలు చెల్లించకుండా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) మరోసారి స్పష్టం చేసింది. బకాయిలు విడుదల చేయకపోతే తాము సేవలు కొనసాగించలేమని ఆశా ఎప్పటి నుంచో ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వచ్చింది. గత నెల 7న రాసిన లేఖలోనూ ఏప్రిల్ 7 నుంచి వైద్య సేవలు కొనసాగించలేమని పేర్కొంది. తాము గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసకున్నామని తెలిపింది. రూ.3500 కోట్లు బకాయిలు పేరుకుపోవడం వల్ల నెట్‌వర్క్ ఆస్పత్రులపై భరించలేని ఆర్థిక భారం పడిందని, అందుకే తాము సేవలు కొనసాగించలేకపోతున్నామని చెప్పింది. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు గుర్తించి బకాయిలు విడుదల చేయాలని తాజా లేఖలో డిమాండ్ చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిలు కంటే నెట్‌వర్క్ ఆస్పత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువగా ఉందని తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో చేసిన వైద్య సేవలకు ఇంత వరకూ పూర్తి చెల్లింపులు జరగలేదని పేర్కొంది. ఇన్ని సమస్యల మధ్య సోమవారం నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్