Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా
ABN, Publish Date - Mar 27 , 2025 | 06:20 PM
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సాక్షి దినపత్రికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాక్షి ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. సాక్షి యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తానంటూ మండిపడ్డారు.

సాక్షి దినపత్రికపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. గురువారం కల్లూరు మండలం దిన్నెదేవరపాడు సాక్షి ఆఫీసు వద్ద ఆమె ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ.. ‘ చికెన్ సెంటర్‌లు, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నానని నాపై తప్పుడు కథనాలు రాస్తున్నారు. సాక్షి యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తా. న్యాయ పరంగా పోరాడతా. నిరాధారమైన వార్తలు సాక్షి పత్రికలో రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడుదాం ఆంధ్రా పేరుతో అవనీతి
గత వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీగా అవినీతి జరిగిందని కొద్దిరోజుల క్రితం భూమా అఖిల ప్రియ అన్నారు. వైసీపీ హయాంలో 120 కోట్ల రూపాయలతో క్రీడలు నిర్వహించామని గొప్పలు చెప్పుకున్నారని, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించలేదని మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి ఇంకా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారే గానీ, వాటి వివరాలు ఇవ్వడం లేదని అన్నారు. విశాఖ పట్టణంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో కూడా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై
IPL 2025: ఐపీఎల్ బ్రాండ్ పవర్ అది.. ఐపీఎల్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా
Updated Date - Mar 27 , 2025 | 06:39 PM