ఏ పని లేనివారు 5,79,934 మంది
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:10 AM
ఇండ్ల వద్దనే ఉంటూ పనిచేసే విధానం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జిల్లాలో 18-50 ఏళ్ల మధ్య వయసున్న వారిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేశారు. శనివారంతో నిర్దేశించిన గడువు ముగియడంతో జిల్లాలో ఏ పని లేనివారి సంఖ్య 5,79,934గా తేలింది. అయితే ఇంకా సర్వే చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. ప్రధానంగా డిగ్రీ పట్టభద్రులతో పాటు ఇంజనీరింగ్ చేసిన యువతకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో శిక్షణ ఇప్పిస్తారు. ఇండ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. కాగా, జిల్లాలో వర్క్ ఫ్రం హోమ్ సర్వే 94 శాతం పూర్తయ్యిందని జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారి రవికుమార్ తెలిపారు.

- ఇప్పటివరకు ప్రభుత్వ సర్వేలో తేలిన లెక్క
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఇండ్ల వద్దనే ఉంటూ పనిచేసే విధానం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జిల్లాలో 18-50 ఏళ్ల మధ్య వయసున్న వారిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వే చేశారు. శనివారంతో నిర్దేశించిన గడువు ముగియడంతో జిల్లాలో ఏ పని లేనివారి సంఖ్య 5,79,934గా తేలింది. అయితే ఇంకా సర్వే చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. ప్రధానంగా డిగ్రీ పట్టభద్రులతో పాటు ఇంజనీరింగ్ చేసిన యువతకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో శిక్షణ ఇప్పిస్తారు. ఇండ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. కాగా, జిల్లాలో వర్క్ ఫ్రం హోమ్ సర్వే 94 శాతం పూర్తయ్యిందని జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారి రవికుమార్ తెలిపారు.
వివరాలిలా..
కుటుంబాలు : 4,53,567
జనాభా : 10,07,649
సర్వే చేసింది : 8,77,453
వివిధ పనులు
చేస్తున్నవారు : 1,75,417
ఏ పనీ చేయనివారు : 5,79,934
ఇంటి వద్ద
పనిచేస్తున్నవారు : 14,192
అదనపు వసతులు
కావాల్సినవారు : 5,579