CM Chandrababu: కుప్పంలో సీఎం బిజీబిజీ.. ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే
ABN, Publish Date - Jan 07 , 2025 | 04:59 PM
Andhrapradesh: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబిగాని పల్లి, తంబి గానిపల్లి గ్రామంలో 41.22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.105.10 కోట్ల వ్యవయంతో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
చిత్తూరు, జనవరి 7: జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్వర్ణ కుప్పంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబిగాని పల్లి, తంబి గానిపల్లి గ్రామంలో 41.22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.105.10 కోట్ల వ్యవయంతో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 4800 మందికి ఉపాధి దిశగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఫ్రూట్ పల్ప్ (మామిడి, టమోటా) తయారీ ద్వారా 50 వేల మంది రైతులకు ప్రయోజనం పొందేలా చర్యలు చేపడుతున్నట్లు మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయ తీర్థ చారి.. సీఎంకు వివరించారు.
అలాగే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబి గానిపల్లి, తంబి గానిపల్లి గ్రామం వద్ద 40 ఎకరాలలో ఏసీఐఐసీ ద్వారా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ (పాల పొడి తయారీ)కి భూమిని కేటాయించారు. దాదాపు రూ.233 కోట్లతో 4000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే లక్ష మంది మహిళా రైతుల భాగస్వామ్యంగా ఉన్నారని ముఖ్యమంత్రికి సీఈఓ తిమ్మప్ప, చైర్మన్ శ్రీదేవి వివరించారు. ఒకే రోజు 200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసే సామర్థ్యం గల క్యాటిల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
Tirumala: ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఆ తేదీల్లో శ్రీవారి దర్శనం దొరకనట్టే
కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్‌లో రూ.10 కోట్ల అంచనా వ్యవయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ (2 అంతస్తులు) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధిలో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ప్రత్యేక గ్రాంట్లతో రూ.60.20 కోట్ల అంచనా వ్యయంతో కుప్పంలో ఏర్పాటు చేశారు. అలాగే రూ. 110.21 కోట్లతో కుప్పం నియోజకవర్గంలోని 451 డ్రైనేజీ వర్కులను, జీఎస్ హెచ్11- ఎస్‌డీపీ నిధుల ద్వారా చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు.
ఇవి కూడా చదవండి...
హైకోర్టులో కేటీఆర్‌కు షాక్.. అరెస్ట్ తప్పదా
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 07 , 2025 | 05:05 PM