ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు..

ABN, Publish Date - Jan 15 , 2025 | 09:03 AM

చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబాల్లో సంతోషం నింపాలని ఆకాంక్షించారు.

చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలుగు ప్రజలందరికి (Telugu People) కనుమ పండగ (Kanuma Festival) శుభాకాంక్షలు (Wishes) తెలియజేశారు. ‘‘కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి... వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది... కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది... ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను...’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

నా వల్ల లక్షల మంది కోటీశ్వరులు అయ్యారు


కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు నాగాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. సంక్రాంతి పండుగా నేపథ్యంలో మంగళవారం నారా వంశీకులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిని, దేవాన్ష్, ఎంపీ భరత్ ఆయన సతీమణి తేజస్విని, తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగాలమ్మ వద్ద పూజల అనంతరం తీర్థప్రసాదాలను కుల పెద్దలు అందజేశారు. నాగాలమ్మ పుట్టకు నూలుపోగులు చుట్టి , పాలను నైవేధ్యంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మిని తదితరులు సమర్పించారు. మహిళలు పూజల్లో ఉండగా నాగ దేవతల సమీపంలోనే మనవళ్లతో చంద్రబాబు గడిపారు. ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆయన అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.

ఊరి పెద్దలతో ముచ్చటించారు. నాగ దేవతల ప్రసాదాలను నారా, నందమూరి కుటుంబాలు స్వీకరించాయి. నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు - అమ్మనమ్మ సమాధులు వద్దకు చేరుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. అనంతరం నారావారిపల్లిలోని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

శ్రీవారి దర్శన టోకెన్ల జారీ.. వాళ్లకు మాత్రమే..

అమరావతి కౌలు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 15 , 2025 | 09:03 AM