పురుషోత్తముల దర్శనంతో పులకింత
ABN , Publish Date - Apr 13 , 2025 | 02:56 AM
మూడుయుగాలకు చెందిన శ్రీనివాసుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుల దర్శనంతో భక్తజనం పులకించిపోయారు.

ముగిసిన వసంతోత్సవం
మూడుయుగాలకు చెందిన శ్రీనివాసుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుల దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. ఒకేసారి ముగ్గురు దేవతామూర్తులను దర్శించి ఆనందపరవశులయ్యారు. వసంతోత్సవంలో చివరి రోజైన శనివారం ఉదయం ఊరేగింపు, మఽధ్యాహ్నం స్నపన తిరుమంజనం అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను తిరుచ్చిల్లో వేంచేపు చేసి ఒకేసారి వసంతమండపం నుంచి వెలుపలకు తీసుకువచ్చారు. పౌర్ణమి కావడంతో భారీగా ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో చేరిన భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు ఇస్తూ గోవింద నామస్మరణతో దర్శించారు. వారాంతం కూడా జత కావడంతో మాడవీధులు భక్తులతో రద్దీగా కనిపించాయి.
- తిరుమల, ఆంధ్రజ్యోతి