ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు.. ఎప్పుడంటే..

ABN, Publish Date - Jan 14 , 2025 | 08:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

Weather Report

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. సోమవరం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడగా.. మంగళవారం చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో వానలు పడతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తర కోస్తా ప్రాంతాలు, అలాగే యానాంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇక, రాయసీమ విషయానికి వస్తే నేడు ఒకట్రోండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: సీఎం చంద్రబాబు..

AP News: ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు... సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..

Updated Date - Jan 14 , 2025 | 08:24 PM