Interstate Gang: దొంగలు తెలివిగా ఏం చేశారంటే..

ABN, Publish Date - Mar 12 , 2025 | 01:23 PM

దోపిడీ కోసం వచ్చిన దొంగలు తెలివిగా తమిళనాడుకు సంబంధించిన ఓమిని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకొని వచ్చారు. ఆ ఓమిని వాహనానికి తమిళనాడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉంది. మొత్తం ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో దొంగ తప్పించుకోవడంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

Interstate Gang: దొంగలు తెలివిగా ఏం చేశారంటే..
Interstate Thieves

చిత్తూరు: నగరంలోని గాంధీరోడ్డులో షాపింగ్ సెంటర్‌లో బీభత్సం సృష్టించిన అంతర్ రాష్ట్ర ముఠా దొంగల (Interstate Thieves)ను పోలీసులు అరెస్టు (police Arrest) చేశారు. దొంగల నుంచి తుపాకులు (Guns), కత్తులు (Knifes) స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం షాపింగ్ సెంటర్‌ (Shopping Centre) లోకి ఆరుగురు దొంగలు తుపాకులతో ప్రవేశించి భారీ చోరీకి యత్నించారు. షాప్ యజమానిని బెదిరించి చోరీకి యత్నించారు. అయితే దొంగల దాడి నుంచి గోడ దూకి షాపు యజమాని తప్పించుకున్నారు. గోడ దూకే క్రమంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. అయితే షాపు లోపలకు చొరబడ్డ దొంగలను షట్టర్ వేసి బయటకు రానీకుండా యజమాని బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సినిమా తరహాలో స్థానికుల సహాయంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ చేశారు. ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దొంలు చిత్తూరు, తమిళనాడు, కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..:

గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు


దొంగలు ప్రెస్ బోర్డు వేసుకొని..

కాగా దోపిడీ కోసం వచ్చిన దొంగలు తెలివిగా తమిళనాడుకు సంబంధించిన ఓమిని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకొని వచ్చారు. ఆ ఓమిని వాహనానికి తమిళనాడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉంది. మొత్తం ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో దొంగ తప్పించుకోవడంతో రిస్క్యూ ఆపరేషన్ పోలీసులు ప్రారంభించారు. రెండు గంటల పాటు శ్రమించి సేప్‌గా పట్టుకున్నారు. మొదట పట్టుకున్న దొంగలను ఎరగా సంఘటన ప్రాంతానికి తీసుకువచ్చి తప్పించుకున్న మరో దొంగను పట్టుకున్నారు. దొంగలు వాడిన తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఓమిని వాహనాం.. అందులో ఉన్న ఒక కత్తి, గ్లౌజులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి తనిఖీలు చేయిస్తున్నారు.

కాగా చిత్తురు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఘటన జరిగిన రెండున్నర గంటల్లో అంతర్ రాష్ట్ర ముఠా దొంగలను పట్టుకున్న పోలీసులను సీఎం అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్ పరోక్ష కామెంట్స్

సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

భారత టెలికాం రంగంలో సంచలన ఒప్పందం..

For More AP News and Telugu News

Updated Date - Mar 12 , 2025 | 02:01 PM