ఇంటర్ ప్రవేశాలకు వేళాయె
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:23 AM
నూతన విద్యావిధానాన్ని అమలులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈనెల 23వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయి. 24 నుంచి మే 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. అనంతరం జూన్ 1వ తేదీన కళాశాలు పునఃప్రారంభం కానున్నాయి. సాధారణంగా పదోతరగతి పరీక్షల ఫలితాల అనంతరం ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభిస్తారు. పదవ తరగతి మూల్యాంకనం ఈనెల 3నుంచి 9వ తేదీ వరకు సాగుతుంది. ఆతర్వాతే పది ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 7 నుంచే ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు జారీ చేస్తున్నారు. పదవ తరగతి ఫలితాలతో సంబంధం లేకుండా పాస్ అవుతామనే ధీమా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- పది ఫలితాలు రాకున్నా ప్రవేశం
- నేటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దరఖాస్తుల ప్రక్రియ
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలు: 51
ప్రభుత్వ : 21
ఎయిడెడ్ : 1
హైస్కూల్ ప్లస్ : 29
తిరుపతి(విద్య), ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): నూతన విద్యావిధానాన్ని అమలులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈనెల 23వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయి. 24 నుంచి మే 30వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. అనంతరం జూన్ 1వ తేదీన కళాశాలు పునఃప్రారంభం కానున్నాయి. సాధారణంగా పదోతరగతి పరీక్షల ఫలితాల అనంతరం ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభిస్తారు. పదవ తరగతి మూల్యాంకనం ఈనెల 3నుంచి 9వ తేదీ వరకు సాగుతుంది. ఆతర్వాతే పది ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 7 నుంచే ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు జారీ చేస్తున్నారు. పదవ తరగతి ఫలితాలతో సంబంధం లేకుండా పాస్ అవుతామనే ధీమా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మధ్యాహ్న భోజనం వరం
మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా అమలుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ విద్యార్థులకు వరంలా మారింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించింది. గత వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రవేశాలు కూడా పెరగవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 10 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
హాల్ టికెట్ జతచేసి దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. ఒత్తిడిలేని విధంగా విద్యా బోధన ఉంటుంది. ఫీజుల భారం ఉండదు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో పైసా ఖర్చులేకుండా చదువుకోవచ్చు. మధ్యాహ్న భోజనం కూడా అందిస్తాం. పదో తరగతి ఫలితాలు రాకున్నప్పటికీ ఇంటర్‌లో చేరవచ్చు. పదోతరగతి పరీక్షల హాల్ టికెట్‌ను జత చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఐవో, తిరుపతి జిల్లా