రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ బోల్తా
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:39 AM
పెళ్లకూరు మండలం 71వ జాతీయ రహదారిపై దిగువ చావాలి వద్ద రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ సోమవారం బోల్తా పడింది.

వాహనం తీసుకుని పరారైన అక్రమార్కులు
వంద బస్తాలు ఎత్తుకెళ్లిన స్థానికులు
పెళ్లకూరు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): పెళ్లకూరు మండలం 71వ జాతీయ రహదారిపై దిగువ చావాలి వద్ద రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ సోమవారం బోల్తా పడింది. వెంటనే రేషన్ మాఫియా ముఠా మినీ లారీని పైకి లేపి అక్కడ నుంచి వాహనం తీసుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుమారు వంద బస్తాల బియ్యాన్ని ఎత్తుకెళ్లిపోయారు. మిగిలిన బియ్యాన్ని దిగువ చావాలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో తరలించిన్నట్లు తెలిసింది. ఆ బియాన్ని తన ఇంటివద్ద దించడంతో టీడీపీ నాయకుడు నేలవల్లి సిద్దులయ్యనాయుడు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగరాజు గ్రామానికి చేరుకుని విచారించారు. 2300 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వీఆర్వోలు రమేష్, వంశీకృష్ణకు అప్పగించారు. వారు ఆ బియ్యాన్ని స్థానిక చౌక దుకాణదారుడికి అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.