స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు నేటినుంచి స్లాట్ బుకింగ్ సేవలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:22 AM
స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు శుక్రవారం స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు ఆర్వో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇందుకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు శుక్రవారం స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు ఆర్వో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇందుకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. తర్వాత దశలవారీగా జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్‌శాఖ అధికారిక వెబ్‌సైట్ ట్ఛజజీట్టట్చ్టజీౌుఽ.్చఞ.జౌఠి.జీుఽ ను సందర్శించాలన్నారు. స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా లేదా పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని డీఆర్ వివరించారు. స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ విధానంపై కక్షిదారులకు అవగాహన కూడా కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.