Share News

తెప్పపై శ్రీనివాసుడి విహారం

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:06 AM

శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో తెప్పపై విహరించారు. సాయంత్రం ఆలయ మాడవీధుల్లో ఊరేగిన ఉత్సవమూర్తులు తర్వాత పుష్కరిణికి చేరుకుని తెప్పలో కొలువుదీరారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పపై పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపారాయణం, అన్నమయ్య సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది.

తెప్పపై శ్రీనివాసుడి విహారం
తెప్పపై శ్రీనివాసుడి విహారం

శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో తెప్పపై విహరించారు. సాయంత్రం ఆలయ మాడవీధుల్లో ఊరేగిన ఉత్సవమూర్తులు తర్వాత పుష్కరిణికి చేరుకుని తెప్పలో

కొలువుదీరారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పపై పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపారాయణం, అన్నమయ్య సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 12 , 2025 | 02:06 AM