తిరుపతి- విశాఖ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:45 AM
సవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 42 ప్రతే ్యక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ఎ.శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి ఈనెల 14 నుంచి మే 29వ తేదీవరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. ఇందులో 14 రైళ్లు విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య రాక పోకలు సాగిస్తాయని వెల్లడించారు

తిరుపతి(సెంట్రల్) ఏప్రిల్13(ఆంధ్రజ్యోతి): వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 42 ప్రతే ్యక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ఎ.శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి ఈనెల 14 నుంచి మే 29వ తేదీవరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. ఇందులో 14 రైళ్లు విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య రాక పోకలు సాగిస్తాయని వెల్లడించారు.
విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు (08547) ఈనెల 16 నుంచి మే 28వ తేదీ వరకు ప్రతి బుధవారమూ విశాఖలో బయలుదేరుతుంది. మరో ప్రత్యేక రైలు (08548) ఈనెల 17 నుంచి మే 29వ తేదీ వరకు తిరుపతిలో ప్రతి గురువారమూ బయలుదేరుతుందని తెలిపారు.
విశాఖపట్నం-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, రేణిగుంట, జోలార్‌పేట, కుప్పం మీదుగా రాకపోకలు సాగిస్తాయని వివరించారు.