రామనామమే మధురంగా..!
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:35 AM
శ్రీరామ నామం మధురం.. అంటూ జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరూరా రామమందిరాలు భక్తులతో సందడిగా మారాయి. తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయంలోని ఊంజల మండపంలో ఉదయం 8-9 గంటల మధ్య సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెద్దజీయర్ స్వామి మఠం నుంచి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొచ్చి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తర్వాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంతుడిపై కొలువుదీరిన శ్రీరామచంద్రమూర్తి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇక, ఆలయంలో భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతరాయంగా వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఆలయం లోపల భక్తులు రామకోటి రాశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

- ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
తిరుపతి(టీటీడీ), ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): శ్రీరామ నామం మధురం.. అంటూ జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరూరా రామమందిరాలు భక్తులతో సందడిగా మారాయి. తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయంలోని ఊంజల మండపంలో ఉదయం 8-9 గంటల మధ్య సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెద్దజీయర్ స్వామి మఠం నుంచి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొచ్చి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తర్వాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంతుడిపై కొలువుదీరిన శ్రీరామచంద్రమూర్తి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇక, ఆలయంలో భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతరాయంగా వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఆలయం లోపల భక్తులు రామకోటి రాశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.