ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: వారి ఇళ్లకు రేపట్నుంచి వెళ్లనున్న టీటీడీ పాలకమండలి సభ్యులు.. ఎందుకంటే..

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:21 PM

ఆంధ్రప్రదేశ్: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీటీడీ ముందుకొచ్చింది. మృతులకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు.

TTD Chairman BR Naidu

తిరుమల: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీటీడీ ముందుకొచ్చింది. మృతులకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ నగదును స్వయంగా పాలకమండలి సభ్యులే మృతుల కుటుంబసభ్యులకు అందజేయాలని నిర్ణయించారు.

Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!


అయితే బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసేందుకు టీటీడీ పాలకమండలి సభ్యులతో ఛైర్మన్ బీఆర్ నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. వీరంతా తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన, గాయపడిన వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పరిహారానికి సంబంధించిన చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆదివారం నుంచే ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి కమిటీ సభ్యులు చెక్కులు పంపిణీ చేయనున్నారు. వైజాగ్, నర్సీపట్నం సందర్శించే బృందంలో జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి ఉండగా.. తమిళనాడు, కేరళను సందర్శించే బృందంలో రామ్మూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేశ్ కుమార్,శాంత రామ్, సుచిత్ర ఎల్లా ఉన్నారు. బాధితుల కుటుంబాల ఇళ్లను వీరంతా నేరుగా సందర్శించి స్థానిక శాసనసభ్యులతో కలిసి చెక్కులను అందించనున్నారు.

YS Sharmila: బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన షర్మిల


కాగా, ఇప్పటికే స్విమ్స్‌లో చికిత్సపొందుతున్న 37 మంది బాధితుల్లో నిన్న(శుక్రవారం) 32 మందిని వైద్యులు డిశ్ఛార్జ్ చేశారు. వారందరికీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల స్వామివారి దర్మనం కల్పించారు. కాగా, ఆదివారం నుంచి వారికి ఆర్థికసాయం చేయనున్నారు. దీంతో వారికి స్వల్ప ఊరట కలిగించే ప్రయత్నం టీటీడీ అధికారులు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలి

Pawan Kalyan: రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే

Updated Date - Jan 11 , 2025 | 04:24 PM