ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: టీటీడీ జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా పూర్తి..

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:26 AM

తిరుమల: వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా పూర్తి అయింది. మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్స్‌ని టీటీడీ అధికారులు జారీ చేశారు. దాదాపు 13 గంటల పాటు 9 కేంద్రాల్లో భక్తులకు టోకెన్స్ జారీ చేశారు.

తిరుమల: వైకుంఠ (Vaikuntha) ద్వారా దర్శనం కోసం ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా (SD Tokens Quota) పూర్తి అయింది. మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్స్‌ని (1 lakh 20 thousand tokens) టీటీడీ అధికారులు (TTD officials) జారీ (Issued) చేశారు. దాదాపు 13 గంటల పాటు 9 కేంద్రాల్లో భక్తులకు టోకెన్స్ జారీ చేశారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచే మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్స్‌ను ఏ రోజుకు.. ఆ రోజూ జారీ చేయనున్నారు. 13 వ తేదీ ఉదయం తిరుపతిలోని భూదేవి, కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో నిత్యం 40 వేల టోకెన్స్‌ను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు. 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఎస్డి టోకెన్స్‌ను జారీ చేయనున్నారు. నిన్నటి (బుధవారం) ఘటన నేపథ్యంలో టోకెన్స్ జారీ చేసే కేంద్రాల వద్ద పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ విజిలెన్స్‌తో పాటు పోలీసులతో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా నియమించనున్న సీనియర్ అధికారుల పర్యవేక్షణలో టోకెన్స్‌ను టీటీడీ జారీ చేయనుంది.


కాగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే... బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా... బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డరు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్

తిరుపతి ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి.. ఆవేదన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 09 , 2025 | 11:26 AM