శభాష్ పోలీస్
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:08 AM
వి.కోట మండల పరిధి నాయకనేరి అటవీ ప్రాంతంలో జరిగిన బంగారం దారి దోపిడీ కేసును రెండ్రోజుల్లోనే పోలీసులు ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. బుధవారం రాత్రి అటవీ ప్రాంతంలో దోపిడీ జరిగిందన్న సమాచారంతో అప్రమత్తమైన వి.కోట పోలీసులు ఎస్పీ మణికంఠ ఆదేశాలతో నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం కేజీఎ్‌ఫకు చెందిన ప్రధాన నిందితుడు అక్కడి కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ జయపాల్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 3.5 కిలోల బంగారం బిస్కెట్లను రికవరీ చేశారు. ఆదివారం చిత్తూరులో ఈ వివరాలను ఎస్పీ మీడియాకు తెలిపారు.

శభాష్ పోలీస్
- రెండ్రోజుల్లోనే బంగారం
దారి దోపిడీ కేసు ఛేదన
వి.కోట, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): వి.కోట మండల పరిధి నాయకనేరి అటవీ ప్రాంతంలో జరిగిన బంగారం దారి దోపిడీ కేసును రెండ్రోజుల్లోనే పోలీసులు ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. బుధవారం రాత్రి అటవీ ప్రాంతంలో దోపిడీ జరిగిందన్న సమాచారంతో అప్రమత్తమైన వి.కోట పోలీసులు ఎస్పీ మణికంఠ ఆదేశాలతో నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం కేజీఎ్‌ఫకు చెందిన ప్రధాన నిందితుడు అక్కడి కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ జయపాల్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 3.5 కిలోల బంగారం బిస్కెట్లను రికవరీ చేశారు. ఆదివారం చిత్తూరులో ఈ వివరాలను ఎస్పీ మీడియాకు తెలిపారు.
ముందస్తు ప్రణాళితో..
కేజీఎ్‌ఫకు చెందిన ఈ ముఠా ముందస్తు ప్రణాళికతో మార్వాడీ వద్ద ఉన్న డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో తమిళనాడులోని మరికొందరితో కలసి దారి దోపిడీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో దొంగల ముఠా కదలికలను పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని రికవరీ చేశారు. అయితే ఇంకా 250 గ్రాముల బంగారం రికవరీ చేయాల్సి ఉందని, దానికోసం ప్రత్యేక పోలీసు బృందాలు అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా, కేసు ఛేదనలో చొరవ చూపిన పలమనేరు డీఎస్పీ డి.ప్రభాకర్, వి.కోట అర్బన్ సీఐ సోమశేఖర్, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు. అలాగే జిల్లా పోలీసులకు కర్ణాటకకు చెందిన మార్వాడీలు, బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయపాల్ కర్ణాటక పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడని.. ఎట్టకేలకు ఆంధ్ర పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేయడంపై అభినందనలు తెలిపారు.