CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:37 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావినతుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

టీడీపీ కేంద్ర కార్యాయలంలో వినతులు స్వీకరించిన సీఎం
22న ఉయ్యాలవాడ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
రెడ్డి సంక్షేమ సంఘం అభ్యర్థన
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. శుక్రవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావినతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి.. పలువురికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం నేరుగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వినతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆయనతో మాట్లాడుతూ.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఫిబ్రవరి 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని రాష్ట్రప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా జీవో ఇచ్చిందని.. జగన్ ప్రభుత్వం అమలు చేయకుండా పక్కన పడేసిందని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడిని ఘోరంగా అవమానించి.. రెడ్డి జాతి మనోభావాలను జగన్ దెబ్బతీశారని, కూటమి ప్రభుత్వం ఉయ్యాలవాడ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి తమ మనోభావాలను కాపాడాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి