Share News

Bird Flu Andhra Pradesh: బర్డ్‌ ఫ్లూతో జాగ్రత్త

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:36 AM

నరసరావుపేటలో బాలిక బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హెచ్‌5ఎన్‌1 లక్షణాలు ఉన్నప్పటికీ, ఇతర అనారోగ్య కారణాలతో మరణించిందని ఐసీఎంఆర్‌ తెలిపింది.

Bird Flu Andhra Pradesh: బర్డ్‌ ఫ్లూతో జాగ్రత్త

ముందస్తు చర్యలు తీసుకోండి

కేసులు, మరణాలు నమోదు కావద్దు

నరసరావుపేటలో బాలిక మృతిపై

ఐసీఎంఆర్‌ బృందం అధ్యయనం

వారితో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ లక్షణాలతో కేసులు, మరణాలు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నరసరావుపేటలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ప్రతినిధుల బృందంతో శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. నరసరావుపేటలో పర్యటన అనంతరం సీఎంను కలిసిన ఐసీఎంఆర్‌ బృందం బాలిక మృతికి గల కారణాలను వివరించింది. బాలిక నుంచి సేకరించిన నమూనాల్లో హెచ్‌5ఎన్‌1 లక్షణాలు బయటపడినప్పటికి, ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారి తీశాయని బృందం సభ్యులు చెప్పారు. ఉడికించిన మాంసం తినడం, చిన్నారి కావడంతో వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెఫ్టోస్పిరోసిస్‌, అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బర్డ్‌ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని భరోసా ఇచ్చారు. ఇలాంటి వాటిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో యాంటీవైరల్‌ డ్రగ్స్‌ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 02:36 AM