Vijayawada Court: మెమోను మీరెలా దాఖలు చేస్తారు
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:29 AM
వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి దాఖలు చేయాల్సిన మెమోను ఇన్‌స్పెక్టర్ దాఖలు చేయడంపై కోర్టు ప్రశ్నించింది. వంశీ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యం జరగడంతో న్యాయస్థానం ఇన్‌స్పెక్టర్‌ను నిలదీసింది

వంశీ కేసులో ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించిన కోర్టు
విజయవాడ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో డీఎస్పీ స్థాయి అధికారి దాఖలు చేయాల్సిన మెమోను మీరెలా దాఖలు చేస్తారని ఇన్ స్పెక్టర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ కోసం రెండోసారి వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో కోర్టు ఆదేశించింది. దీనిపై శుక్రవారం విచారణ సాగింది. ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్యాణి సెలవులో ఉండటంతో కౌంటర్ దాఖలు చేయడానికి ఈ నెల 15 వరకు గడువు కావాలని పటమట ఇన్‌స్పెక్టర్ పవన్ కిశోర్ మోమో దాఖలు చేశారు. దీనిపై వంశీ తరఫు న్యాయవాది దేవీసత్యశ్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో న్యాయాధికారి హిమబిందు ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించారు.