Low Temperatures : జి.మాడుగులలో గజగజ
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:18 AM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం అధికమవుతోంది. దీంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు.
3.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
పాడేరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం అధికమవుతోంది. దీంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. శనివారం జి.మాడుగులలో 3.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో 4 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదుకావడం ఇది రెండోసారి. అలాగే డుంబ్రిగుడలో 4.2, హుకుంపేట, అరకు లోయల్లో 4.9, పాడేరులో 7.5, అనంతగిరిలో 7.6, చింతపల్లిలో 7.9, పెదబయలులో 8.2, ముంచంగిపుట్టులో 9, కొయ్యూరులో 10.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఉదయం పది గంటల వరకూ పొగమంచు దట్టంగా అలముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
Updated Date - Jan 12 , 2025 | 06:18 AM