ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Veterinary Dept : ‘క్రమశిక్షణ’ అధికారం డైరెక్టర్‌కు లేదా?

ABN, Publish Date - Jan 14 , 2025 | 03:39 AM

పశుసంవర్ధకశాఖలో కొన్ని జీవోలపై పెద్ద రగడ జరుగుతోంది. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లకు పదోన్నతులు, పోస్టింగ్‌లు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌లపై ....

  • గతంలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌

  • తాజాగా 12 మంది వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లకు పదోన్నతులు

  • లేని అధికారాన్ని డైరెక్టర్లు ఉపయోగించారా?

  • పశుసంవర్ధకశాఖలో జీవోల రగడ

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పశుసంవర్ధకశాఖలో కొన్ని జీవోలపై పెద్ద రగడ జరుగుతోంది. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లకు పదోన్నతులు, పోస్టింగ్‌లు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌లపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన రాష్ట్ర డైరెక్టర్‌కు అధికారం లేదన్న వాదన చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రం, రాష్ట్ర విభజన తర్వాత జారీ అయిన కొన్ని జీవోలపై కొంత కాలంగా ఆశాఖలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో 102తో గత డైరెక్టర్‌ ఒక ఏడీని సస్పెండ్‌ చేయడంతో లేని అధికారాన్ని గత డైరెక్టర్‌ ఉపయోగించారంటూ హైకోర్టులో వ్యాజ్యాలు కూడా నడిచాయి.

తాజాగా అదే అధికారంతో ప్రస్తుత డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు తాజాగా 12 మంది వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించి, పోస్టింగ్‌లు ఇచ్చారు. కానీ పదోన్నతుల మెమోలో 1996లో ఇచ్చిన జీవో 54తో పాటు 2013లో వచ్చిన జీవో 141 ఆధారంగా పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే జీవో 54 ప్రకారం బదిలీలు లేదా పదోన్నతులు ఇచ్చే అధికారం డైరెక్టర్‌కు లేదని పలువురు వాదిస్తున్నారు. అయితే జీవో 54ను 1999 అక్టోబరులో 102గా మార్చారు. దీని ప్రకారం డైరెక్టర్‌కు అధికారం ఉందంటున్నా.. జీవో 102ను కాకుండా 54ను మెమోల్లో ఎందుకు ఉటంకిస్తున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Updated Date - Jan 14 , 2025 | 03:39 AM