Share News

బర్డ్‌ ఫ్లూతోనే బాతులు మృతి

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:24 PM

బర్డ్‌ ఫ్లూ కారణంగానే కర్నూలు నగరంలో బాతులు మృతి చెందినట్టు నిర్ధారణ అయిందని పశుసంవర్థక శాఖ జేడీ శ్రీనివాస్‌ తెలిపారు.

    బర్డ్‌ ఫ్లూతోనే బాతులు మృతి

కర్నూలు అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): బర్డ్‌ ఫ్లూ కారణంగానే కర్నూలు నగరంలో బాతులు మృతి చెందినట్టు నిర్ధారణ అయిందని పశుసంవర్థక శాఖ జేడీ శ్రీనివాస్‌ తెలిపారు. మృతి చెందిన బాతుల నమూనాలను మధ్యప్రదేశలోని భూపాల్‌లో ఉన్న నేషనల్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కు శాంపుల్స్‌ పంపగా అక్కడి నుంచి బర్డ్‌ఫ్లూనకు సంబంధించిన పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయని చెప్పారు. దీంతో కర్నూలు నగరంలోని ఎనఆర్‌పేటలో కిలోమీటరు వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామని వివరించారు. పరిసర ప్రాంతాల్లోనూ వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రెడ్‌ అలర్ట్‌ జోనలో 8 బృందాలు, సర్వే లైన్స జోనలో మరి కొన్ని బృందాలతో బర్డ్‌ఫ్లూపై నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. బాతులు, కోళ్ల వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఫ ఉడికించిన మాంసం, గుడ్లు తినవచ్చు:

బర్డ్‌ ఫ్లూగా తేలిన ప్రాంతాల్లో వాటి అవశేషాలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి మట్టిలో పూడ్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని జేడీ స్పష్టం చేశారు. బర్డ్‌ ఫ్లూ వల్ల కోడి గుడ్లను బాగా ఉడికించి ఆహారంగా తీసుకోవచ్చని, నూరు డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఉడికిస్తే.. ఎలాంటి క్రిములు వాటిల్లో ఉండవని స్పష్టం చేశారు.

Updated Date - Feb 14 , 2025 | 11:24 PM