బలభద్రపురం పెద్దచెరువు పరిశీలన
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:02 AM
బిక్కవోలు మండలం బలభద్రపురంలో గత ప్రభుత్వంలో రూ.1.50కోట్ల రుడా నిధులతో చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను మంగళవారం రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధికారుల బృందం పరిశీలించింది. గతంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెరువు అభివృద్ధి పనులు, పనుల్లో జరిగిన అవినీతిపైనా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చెరువు అభివృద్ధి పనులు, అవినీతిని నిగ్గు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

చెరువు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక బృందం ఆరా
అనపర్తి మార్చి 18 (ఆంధ్రజ్యోతి): బిక్కవోలు మండలం బలభద్రపురంలో గత ప్రభుత్వంలో రూ.1.50కోట్ల రుడా నిధులతో చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను మంగళవారం రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధికారుల బృందం పరిశీలించింది. గతంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెరువు అభివృద్ధి పనులు, పనుల్లో జరిగిన అవినీతిపైనా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చెరువు అభివృద్ధి పనులు, అవినీతిని నిగ్గు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం చెరువు వద్దకు చేరుకున్న అధికారులు వాటర్ ఇన్‌ప్లో, అవుట్‌ప్లోకు చేయాల్సిన ఏర్పాటును, వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయడంతో బాటు చిన్నారులకు ఏర్పాటు చే యాల్సిన పార్కు, చెరువు చుట్టూ లైటింగ్, చెరువులో అస్తవ్యస్తంగా ఉన్న గర్భాన్ని, సరిచేయాల్సిన పనులను బృం దం పరిశీలించింది. ఈ సందర్భంగా పనుల్లో అవినీతిపై చేపట్టిన చర్యలపై ప్రశ్నించగా పనులకు సంబంధించిన ఎమ్-బుక్కులను పంచాయతీకి అందజేస్తామని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. బృందంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ ఆలీ, ఇరిగేషన్ డీఈఈ ఆనందకుమార్, తహశీల్దార్ కృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి, ఉన్నారు. ఈ సందర్బంగా నల్లమిల్లి సుబ్బారెడ్డి పనుల్లో జరిగిన అవినీతి, లోపించిన నాణ్యతను అధికారులకు వివరించారు.
ఫిషర్‌మెన్ సొసైటీ లీజుపై డీఎల్‌పీవో..
ఇదిలా ఉండగా అభివృద్ధి పనుల పేరుతో రెండేళ్లుగా పెద్ద చెరువు మూత పడినప్పటికీ పంచాయతీలో ఫిషర్‌మెన్ సొసైటీ పేరున లీజు ఉంది. దీనిపై ఫిషర్‌మెన్ల ఫిర్యాదుతో డీఎల్‌పీవో నాగవేణి పెద్ద చెరువును పరిశీలించారు. అభివృ ద్ధి పేరుతో చెరువును అస్తవ్యస్తంగా తయారు చేయడంతో ఫిషర్‌మెన్లు రెండేళ్లుగా చేపల పెం పకానికి దూరమయ్యారు. అయినా పంచాయతీ అధికారులు లీజు సొమ్ములు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో వారు ఎమ్మెల్యే నల్లమిల్లి దృష్టికి తీసుకురావడంతో ఆయన జిల్లా అధికారులకు విషయాన్ని వివరించి లీజు రద్దు చేయాలని సూచించారు. దీంతో డీఎల్‌పీవో చెరువును పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు.