చేబ్రోలులో రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:34 AM
గొల్లప్రోలురూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో శనివారం రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. సీతారామస్వామి ఆలయ కమిటీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, బాప

సీనియర్స్ విజేత కొవ్వాడ
జూనియర్స్ విజేత వడిశలేరు
గొల్లప్రోలురూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో శనివారం రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. సీతారామస్వామి ఆలయ కమిటీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా లు, తెలంగాణాలోని హైదరాబాద్ నుంచి ఎడ్ల జతలు తరలివచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నివాసం పక్కనే ఉన్న పుంతరోడ్డులో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్స్ విజేతలకు ఓదూరి నాగేశ్వరరావు, కిషోర్‌లు, చేదులూరి దత్తుడు, గవర్రాజు, సారిపల్లి లోవరాజులు.. జూనియర్స్ విజేతలకు అల్లం దొరబాబు, ఓరుగంటి చిన్ని, సారిపల్లి శ్రీను, కర్రి చిట్టిబాబు నగదు పురస్కారాలు, షీల్డులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా యనమల కృష్ణుడు, సిద్దా నా నాజీ, సామర్లకోట రామకృష్ణ వ్యవహరించారు.
విజేతలు వీరే
సీనియర్స్ విభాగంలో నిర్దేశించిన దూరాన్ని కాకినాడ జిల్లా కొవ్వాడ మట్టా నవనీత్ శ్రీ మణికంఠకు చెందిన ఎడ్ల జత 6 నిమిషాల 56సెకన్ల 78 పాయింట్ల సమయంలో పరుగెత్తి ప్రథమస్థానంలో నిలవగా, కోనసీమ జిల్లా గుమ్మిలేరు కోరా తేజ చౌదరి ఎడ్ల జత 7-01-28 సమయంలో, మండపేట వేగుళ్ల తేజ చౌదరి ఎడ్ల జత 7-08-09సమయంలో పరుగెత్తి ద్వితీ య, తృతీయ స్థానాల్లో నిలిచాయి. జూనియర్స్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు సిద్ది వినాయక ధరణి శ్రీనివాస్‌కు చెందిన ఎడ్ల జత 4-42-65 సమయంలో పరుగెత్తి తొలి స్థా నం సాధించగా, హైదరాబాద్‌కు చెందిన కె.సతీష్ ఎడ్లజత 4-45-09 సమయంలో, కాకినాడ జిల్లా గొల్లప్రోలు నిమ్మకాయల నూకరాజు ఎడ్ల జత 4-48-40, వన్నెపూడి బవిరిశెట్టి మణికి చెందిన ఎడ్ల జత 4-50-56 సమయంలో పరుగెత్తి వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి.