నిరాశజనక ‘ఫలితాలు’
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:57 AM
గోకవ రం ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ మరింత దిగజా రుతున్నాయి. ఈనెల 12న విడుదలైన ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే ఇదే నిజమే అని అని పించకమానదు. ద్వితీయ సంవత్సరానికి చెం దిన 158 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 92 మంది(58.22)మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష ఫలితాల పరిస్థితి
ఆందోళనలో తల్లిదండ్రులు
గోకవరం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): గోకవ రం ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ మరింత దిగజా రుతున్నాయి. ఈనెల 12న విడుదలైన ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే ఇదే నిజమే అని అని పించకమానదు. ద్వితీయ సంవత్సరానికి చెం దిన 158 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 92 మంది(58.22)మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 66 మంది ఫెయిలై నిరుత్సాహ పరిచారు. ఇక ప్రథమ సంవత్సరం ఫలితాలు మరింత ఆందో ళన కలిగిస్తున్నాయి. మొత్తం 214మంది విద్యార్థులకు గాను పరీ క్షకు 204మంది హాజర వ్వగా 63మంది విద్యా ర్థులు(30.3శాతం) మా త్రమే పాసయ్యారు. మిగిలిన 151 మంది విద్యార్థులు ఫెయిల య్యారు. దీనిని బట్టి స్థానిక జూనియర్ కళా శాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భిన్న అభిప్రాయాలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూనియర్ కళాశాలలపై దృష్టి సారించింది. పాఠ్య పుస్తకాలతో పాటు, మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పించింది. అయితే ఆశిం చిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బోధన సరిగా జర గకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవ్వడం. విద్యార్థుల స్థాయిని అంచనా వేసి అందుకనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్లే ఇంత దారుణమైన ఫలితాలు రావడానికి కార ణమని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులే ఎక్కువ
గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 11 మంది అధ్యాపకులు పని చేస్తు న్నారు. వీరిలో ఐదుగురు రెగ్యులర్ కాగా, మిగి లిన ఆరుగురు కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేస్తున్నవారే. పూర్తి స్థాయి అధ్యాపకులు తక్కు వగా ఉండడం, కాంట్రాక్టు అధ్యాపకులపైనే ఎక్కువుగా ఆధారపడి తరగతులను నిర్వహిం చడం జరుగుతోంది. దీంతో విద్యార్థులపై ఎవ్వ రికీ సరైన పట్టు లేకుండాపోయింది. వచ్చామా! బోధించామా! వెళ్లామా! అనే రీతిలోనే ఇక్కడ తరగతుల నిర్వహణ ఉందనే విమర్శలు ఉన్నాయి. దీనివల్లే ఈ కళాశాలలో విద్యాప్రమా ణాలు రోజురోజుకు దిగజారు తున్నాయనే ఆరోపణలు ఇటీవల గట్టిగా వినిపిస్తున్నాయి.