జన పవనాలు!

ABN, Publish Date - Mar 15 , 2025 | 02:09 AM

చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్‌.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ

జన పవనాలు!
జయకేతనం సభా వేదికపై పవన్‌తో పాటు నాయకులు

జన సైనికులే..జనసేన బలం

బంధం.. అనుబంధం మీరే

మీ అందరి శ్రమతోనే అధికారంలోకి..

వైసీపీ అరాచకాలను బద్దలు కొట్టాం

మమ్మల్ని మీరే క్రమశిక్షణలో ఉంచాలి

చిత్రాడ సభలో పవన్‌ కల్యాణ్‌

అంచనాలకు మించి జనం

మధ్యాహ్నానికే నిండిన వేదిక

చోటులేక బయట వేలల్లో

అదిరిపోయిన ఏర్పాట్లు

వహ్‌వా అనిపించిన ఆతిథ్యం

తరలివచ్చిన మహిళలు

తీవ్ర ఎండతో ఇబ్బందులు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్‌.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇన్నేళ్లలో ఎందరో జనసైనికులు పార్టీ సిద్ధాంతాల కోసం చనిపోయిన వైనాన్ని గుర్తుచేసి వారి సేవలు ఎనలేనివని కొనియాడారు. వెరసి జనసైనికులతోనే తన బంధం.. అనుబం ధం అని వెల్లడించి పార్టీ క్యాడర్‌ తన దృష్టలో ఎంత గొప్పస్థానం దక్కించుకున్నారో వివరించి అందరితో చప్పట్లు కొట్టించుకున్నారు. అటు చిత్రాడ సభ కనివినీ ఎరుగని రీతిలో సక్సెస్‌ అయింది. అంచనాలకు మించి జనం భారీగా తరలి రావడంతో సభా ప్రాం గణం మధ్యాహ్నానికే కిక్కిరిసింది. రాష్ట్రవ్యాప్తంగా దారులన్నీ చిత్రాడవైపే కదలడంతో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 216హైవే ఇసుకేస్తే రాలనంతగా మారిపోయింది.మహిళలు.యువత..రైతులు.. ఇలా అన్ని వర్గాలు సభకు హాజరవడం కన్నులపండువగా కనిపించింది. అటు పవన్‌ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు డిప్యూటీ సీఎంగాను,పంచాయతీరాజ్‌, అటవీశాఖ మంత్రిగా సాధించిన విజయాలను ప్రత్యేక వీడియో ద్వారా ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది.పవన్‌ కోసం జనం ఉదయం నుంచే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మూడు ప్రవేశద్వారాలు కిక్కిరిసిపోయాయి. అటు పోలీసులేమో మధ్యాహ్నం 12గంటల నుంచే లోపలకు అనుమతించడంతో జనం ఆరుబయటే ఎం డలో ఉండిపోయారు.ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకే సభలోని అన్ని గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో వేలాది జనం బయటే ఉండిపోయారు. చాలామంది వద్ద వీవీఐపీ, వలంటీర్ల పాసులు ఉన్నా పోలీసులు లోపలకు పంపకపోవడంతో చాలాసేపు వాగ్వాదం జరిగింది. అటు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో కొందరు మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. కానీ అంచనాలకు మించి తరలివచ్చిన జనం ఎక్కడా ఎండకు భయపడకుండా రాత్రి పదిన్నర వరకు సభలోనే ఉండిపోయారు.

4:30 గంటలకు పవన్‌..

పవన్‌కల్యాణ్‌ సరిగ్గా 4.30గంటలకు సభా ప్రాంగణానికి హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అనంతరం సభా వేదిక పక్కనే ఉన్న ప్రత్యేక బసలోకి వెళ్లి తిరిగి స్టేజీ మీదకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. ఈలోపు చాలాసేపు మంత్రి నాదెండ్లతో భేటీ అయ్యారు. అటు పవన్‌ వచ్చిన హెలికాఫ్టర్‌ సాయంత్రం ఐదుగంటలకు కాకినాడ వెళ్లింది. సభ ముగిసిన తర్వాత పవన్‌ కాకినాడలో జేఎన్టీయూ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. తిరిగి శనివారం ఉదయం పవన్‌ హెలికాఫ్టర్‌లో అమ రావతికి బయలుదేరనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సభలో జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్‌, మంత్రి దుర్గేష్‌, పలువురు ఎమ్మెల్యేలు ప్రసంగించారు. పవన్‌ తన ప్రసంగంలో ఎక్కడా పిఠాపురం నియోజవకర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తేలేదు.అనేక విస్తృత అంశాలపై అనర్గళంగా ప్రసంగించడంతో సభకు వచ్చిన వారంతా చప్పట్లతో పవన్‌ను అభినందించా రు. పవన్‌ సైతం సభను సక్సెస్‌ చేయడానికి శ్రమించి, సహకరించిన కాకినాడ కలెక్టర్‌,ఎస్పీతోపాటు పోలీసులను అభినందించారు.సినిమాలనుంచి తన రాజకీయ ప్రస్థానం వరకు కూలంకషంగా చర్చించడం అభిమానులను అలరించింది. జనసేనకు అధికారం ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్న విషయాన్ని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రసంగం మధ్యలో పవన్‌ అని జనం అరు స్తుండడంతో.. కొంత అసహనం చెందిన పవన్‌ నా పేరు అరుస్తున్నారు.. అంటే.. నా ప్రసంగం వినడం లేదని అర్థం అని చురకలు అంటించడంతో జనసైనికులు ప్రసంగంపై దృష్టిసారించారు. జగన్‌లా తాను కోడికత్తి రాజకీయాలు చేయడం లేదని సైద్ధాంతిక రాజకీయాలు చేస్తున్నాని గుర్తుచేశారు.పదేళ్లలో పడ్డాం..నిలబడ్డాం అని పేర్కొని జనసేన ప్రస్థానాన్ని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో యువ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా జనసేన ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. సభ ముగిసిన తర్వాత జనం తిరిగి స్వస్థలాలకు తిరిగి వెళ్లే సమయంలో వారందరికీ భోజన వసతిని పార్టీ సమకూర్చింది.అంచనాలకు మించి వచ్చిన జనానికి ఎక్కడా భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆతి థ్యం వహ్‌ వా అనేలా చేసింది. అటు రాష్ట్రస్థాయి సభ చిత్రాడలో జరుగుతుండడంతో ఊరి గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీయడంతో గూగుల్‌లో ట్రెండింగ్‌గా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు భారీగా కిక్కిరిశాయి.

Updated Date - Mar 15 , 2025 | 02:09 AM