రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?

ABN, Publish Date - Mar 30 , 2025 | 12:20 AM

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్‌ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్‌ను ట్రాక్‌ చేసే పనిలో పడ్డారు. తూర్పు

రాత్రి 11:42 గంటలకు.. కొంతమూరులో ఏం జరిగింది?
సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై దర్యాప్తు వేగవంతం

విజయవాడలో 3 గంటలుఎక్కడున్నారు..

నలుగురితో ప్రత్యేక బృందం ఏర్పాటు

వివరాలు వెల్లడించిన ఐజీ, ఎస్పీ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమా నాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరు వద్ద ఈ నెల 24వ తేదీ రాత్రి 11:42 గంటలకు ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్‌ పగడాల కొంతమూరు రహదారిలో మర ణించే వరకు ప్రతి మూమెంట్‌ను ట్రాక్‌ చేసే పనిలో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌, ఎస్పీ నరసింహకిశోర్‌ పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల పోస్టుమార్టం రిపోర్టులో ప్రాఽథమిక అంశాలను వెల్లడించారు. చాలా ముఖ్యమైన కేసుగా పరిగణనలోకి తీసుకుని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ నేతృత్వంలో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌, నార్త్‌ జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్‌, ఉమామహేశ్వరరావు, విజయ్‌కుమార్‌లతో ప్రత్యేక టీమ్‌ను నియమించారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలించి నివేదిక ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. కీసర- పొట్టిపాడు మధ్య విజయవాడలో ప్రవీణ్‌ 3 నుంచి 4 గంటల పాటు ఎక్కడ స్టే చేశారు.. అక్కడ ఎవ రిని కలిశారు. ఎవరితో మాట్లాడారనేది తేలాల్సి ఉందన్నారు. విజయవాడలో సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నామన్నారు. కొంతమూరులో సంఘటన జరిగిన సమయంలో ప్రవీణ్‌ బుల్లెట్‌ను దాటుకుని వెళ్లిన 4 కార్లను గుర్తించి వారిని కూ డా విచారించామన్నారు. అన్ని కోణాల్లో కేసు ద ర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Updated Date - Mar 30 , 2025 | 12:20 AM