అంబేడ్కర్‌పై కవితాగానం
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:01 AM
ఈ నెల 14వ తేదీ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం పురమందిరంలో నిర్వహించిన కళాగౌతమి రచయితల సమావేశంలో అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ పలువురు కవులు చక్కటి కవితాగానం చేశారు.

కళాగౌతమి రచయితల సమావేశంలో ఇద్దరు ప్రముఖులకు సత్కారం
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 14వ తేదీ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం పురమందిరంలో నిర్వహించిన కళాగౌతమి రచయితల సమావేశంలో అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ పలువురు కవులు చక్కటి కవితాగానం చేశారు. ‘ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ అంబేద్కర్’ అనే అంశంపై జరిగిన ఈ కవితాగానంలో కవులు మల్లెమొగ్గల గోపాలరావు, వీవీ సుబ్రహ్మణ్యం, జో.రా శర్మ, ఎం.సూర్యనారాయణ, ఓబులేశు తదితరులు అంబేడ్కర్ గొప్పదనాన్ని, ఆయన ఆశయాలు, ఆలోచనాధోరణి, సాధించిన విజయాలను, రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఎదిగిన తీరును కవితాగానంతో ఆసక్తిగా తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చేతులమీదుగా సత్కారం పొందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత అరిపిరాల నారాయణరావు, ఎన్నో ప్రవచనాలు, అనేక బిరుదులు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి తాతా సందీప్‌శర్మలను సత్కరించారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు బీవీఎస్ మూర్తి, అధ్యక్షుడు పీవీబీ సంజీవరావు, కవి వై.మోహనరావు చేతులమీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది. కళాగౌతమి కార్యదర్శి బీహెచ్‌వీ రమాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కవి ఓబులేశు వందన సమర్పణ చేశారు.