Share News

1354 ఎకరాల్లో అనఽధికార లేఅవుట్లు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:27 AM

రుడా పరిధిలో 1354 ఎకరాల్లో అనధికార లేఅవుట్ల వివరాలు సేకరించామని, ఆయా గ్రామ పంచాయతీ సెక్ర టరీలకు నోటీసులు ఇస్తున్నట్టు రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి,వైస్‌ చైర్మన్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.

1354 ఎకరాల్లో అనఽధికార లేఅవుట్లు
రుడా కార్యాలయంలో అధికారులతో చర్చిస్తున్న చైర్మన్‌ బీవీఆర్‌ చౌదరి, వైస్‌ చైర్మన్‌ కేతన్‌గార్గ్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 (ఆంధ్ర జ్యోతి) : రుడా పరిధిలో 1354 ఎకరాల్లో అనధికార లేఅవుట్ల వివరాలు సేకరించామని, ఆయా గ్రామ పంచాయతీ సెక్ర టరీలకు నోటీసులు ఇస్తున్నట్టు రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి,వైస్‌ చైర్మన్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. రుడా ఆఫీసులో శుక్ర వారం రుడా అధికారులతో కలిసి ఆయా పం చాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారం రోజుల్లో పంచాయతీ ల్లోని అనధికార లేఅవుట్లు గుర్తించి హెచ్చరిక బోర్డు లు పెట్టాలని ఆదేశించారు. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే తొర్రేడు, నరేంద్రపురం, హుకుంపేట, బొమ్మూ రు,దేవరపల్లి కార్యదర్శులు తీసుకున్న నిర్ణయాలపై వివరణ తీసుకున్నట్టు చెప్పారు. అనధికార లేఅవుట్లను రుడా కార్యాలయం ద్వారా క్రమబద్ధీకరించుకునే వీలుంటుంద న్నారు. సమావేశంలో రుడా చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ జీవీఎస్‌ఎన్‌.మూర్తి, రుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ నార్కె డిమిల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:27 AM