Share News

సాగరతీరం.. విన్యాసాలమయం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:44 AM

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 11 ( ఆంధ్ర జ్యోతి): కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో ఇండియా- అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న టైగర్‌ ట్రంప్‌- 2025 యాంపీబిఎస్‌ విన్యాసాలు ఎం తో ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతో పాటూ ఇండియాకు

సాగరతీరం.. విన్యాసాలమయం

కాకినాడలో కొనసాగుతున్న ‘టైగర్‌ ట్రంప్‌-25’

పాల్గొన్న ఇండియా- అమెరికా దేశాల

1000 మంది త్రివిధ దళాల సభ్యులు

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 11 ( ఆంధ్ర జ్యోతి): కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట నేవల్‌ ఎన్‌క్లేవ్‌లో ఇండియా- అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న టైగర్‌ ట్రంప్‌- 2025 యాంపీబిఎస్‌ విన్యాసాలు ఎం తో ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతో పాటూ ఇండియాకు చెందిన ఐఎన్‌ఎస్‌ జల స్వ, ఐరావత్‌ యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొని యుద్ధ సమయంలో శత్రుదేశాలపై చేసే వీరోచిత పోరాటల ప్రదర్శన, దేశ అంతర్గత భద్రత, విపత్తులు, ఆపద సమయంలో మానవతా సమయం అందించే రెస్క్యూ సమయంలో అం దించే సేవలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. తీరప్రాంతంలో స్పేస్‌ ఐఆర్‌ఎఫ్‌ను భద్రపరచడంతో పాటూ ప్రకృ తి వైపరీత్యం, హాస్పిటల్‌ తదితర వాటిపై విన్యాసాలు ప్రదర్శించారు. ఇరుదేశాలకు చెందిన సుమారు 1000 మంది త్రివిధ దళాల సభ్యులు విన్యాపాల్లో పాల్గొని యుద్ధ సమయాల్లో నిర్వహించే విధులు, పో రాటాలను ప్రదర్శించారు. భారత్‌ భూ భాగంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు, భూభాగం ఆక్రమణకు ప్రయత్నిస్తున్న శత్రుదేశాలపై త్రివిధ దళా లు దాడులు చేసి, శత్రువు శిబిరాలపై ఆకాశ, జల, భూ భాగంపై నుంచి మెరుపు దాడులతో ఆట కట్టించారు. మెకనైజ్డ్‌ లాంగ్‌ ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌లు, ల్యాండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ డాక్‌, ల్యాండింగ్‌ షిప్‌ ట్యాంకులు, యుద్ధ ఎయిర్‌క్రాప్ట్‌లు, యుద్ధ ట్యాంకర్ల విన్యాసాలు ఎంతో అబ్బురపరిచాయి.

ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్టం

హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్‌

టైగర్‌ ట్రంఫ్‌ పేరిట ఇండియా-అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలతో ఇరుదేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణ ం, బంధం మరింత బలపడుతుందని హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్‌ పేర్కొన్నారు. యాంపీబిఎస్‌ విన్యాసాలను తిలకించేందుకు శుక్రవారం కాకినాడ తీరానికి ఇరు దేశాల త్రివిధ దళాల అధికారులతో కల సి వచ్చారు. ఇరుదేశాల అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఘన స్వాగతం పలికారు. జెన్నిఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ ఏటా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలతో కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఈ కసర త్తు వల్ల విన్యాసాల్లో ఇరుదేశాల త్రివిధ దళాలకు ఉన్న ప్రతిభ, మెళుకువలను ప్రదర్శించి మరింత పటిష్టంగా ఉం డేందుకు తోడ్పడుతుందన్నారు. మా బలగాలు మునుపెన్నడూ లేనంతగా సన్నిహితంగా పని చేస్తున్నాయన్నారు. టైగర్‌ట్రంప్‌ వంటి వ్యాయామాలు, కసరత్తు ద్వారా యునైటెడ్‌ స్టేట్స్‌, భారత్‌ల మధ్య పరస్పర భద్రతా లక్ష్యాలను సా ధించేందుకు దోహదంచేస్తుందన్నారు. బందోబస్తు ఏర్పాట్లను ఎస్‌డీపీవో దేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌, రూరల్‌ సర్కిల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ పర్యవేక్షించారు.

Updated Date - Apr 12 , 2025 | 12:44 AM