త్రివిధ దళాలు.. అదిరే విన్యాసాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:36 AM
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సముద్ర తీరంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయింఫ్ విన్యాసాలు ఆక ట్టుకుంటున్నాయి. భారత్- అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న టైగర్ ట్రంప్ విన్యాసాల్లో భాగంగా శనివారం ఇరుదేశాల త్రివిధ దళాలు పోటాపోటీగా భూభాగం

కాకినాడ సముద్రతీరంలో ఆరో రోజు ‘టైగర్ ట్రయింఫ్ -2025’
భూమి, సముద్రం, ఆకాశంలో ప్రదర్శనలు
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సముద్ర తీరంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయింఫ్ విన్యాసాలు ఆక ట్టుకుంటున్నాయి. భారత్- అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న టైగర్ ట్రంప్ విన్యాసాల్లో భాగంగా శనివారం ఇరుదేశాల త్రివిధ దళాలు పోటాపోటీగా భూభాగం, సముద్రం, ఆకాశంలో విన్యాసాలు నిర్వహించాయి. సూర్యారావుపేట నేవెల్ ఎన్‌క్లేవ్‌లో టైగర్ ట్రయింఫ్-2025లో భాగం గా భారత్-అమెరికా యంపీబియస్ విన్యాసాల్లో ఇరుదేశాలకు చెందిన సుమారు 1000 మంది త్రివిధ దళాల సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా యుద్ధ సమయంతో పాటూ తుఫాన్లు, విపత్తుల వేళ అనుసరించాల్సిన వ్యూహం, అందించే సహా య పునరావాస సమయాల్లో ఏ కార్యక్రమాలు చేస్తారో ఇరుదేశాల సైనిక దళాలు ప్రదర్శించారు. హోవర్ క్రాఫ్ట్‌లు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ హెలికాప్టర్లు వినియోగం, భధ్రత, అత్యాధునిక ఆయు ధాలను వినియోగించే శత్రుదేశాలపై ఎలా దాడులు చేస్తారో సంయుక్తంగా విన్యాసాలు చేశారు. యుద్ధ సమయాల్లో గాయడిన త్రివిధ దళాల సభ్యులకు ఏ విధంగా ప్రఽథమ చిక్సిత, వైద్య సేవలు తదితర వాటిపై ప్రదర్శించారు. శనివారంతో యుద్ధ విన్యాసాలు ముగిసినట్టేనని భావిస్తున్నారు.