Share News

గ్రామాల ప్రగతే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:49 AM

గ్రామాల ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కామరాజుపేట, కొత్తపల్లి, గోకవరం, తిరుమలా యపాలెం, మల్లవరం గ్రామాల్లో సుమారు రూ.1.65 కోట్ల వ్యయంతో నిర్మించిన సిమెంట్‌ రోడ్లును మంగళవారం ఆయన ప్రారంభించారు.

గ్రామాల ప్రగతే ప్రభుత్వ లక్ష్యం
కామరాజుపేటలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ

  • జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ

  • పలు గ్రామాల్లో పల్లె పండగ

గోకవరం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): గ్రామాల ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కామరాజుపేట, కొత్తపల్లి, గోకవరం, తిరుమలా యపాలెం, మల్లవరం గ్రామాల్లో సుమారు రూ.1.65 కోట్ల వ్యయంతో నిర్మించిన సిమెంట్‌ రోడ్లును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు, శాశ్వత రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యా లు కల్పించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడి పించడానికి, యువతకు ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని పేర్కొన్నారు. కామరా జుపేటలోని దుర్గా కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసు కెళ్లారు. దీంతో ఎమ్మె ల్యే నెహ్రూ స్పందించి పట్టాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటా నని హమీ ఇచ్చారు. గోకవరంలో ప్రభుత్వాసు పత్రి సమీపంలో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయ సమీపంలో ఉన్న రైతు భరోసా కేం ద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, సేకరించిన ధాన్యంతో మిల్లర్ల వద్దకు బయలుదేరిన వాహ నాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీపీ సుంకర శ్రీవల్లి, నాయకులు అడపా భరత్‌, కన్నబాబు, ఉంగరాల రాము, పాలూరి బోస్‌, జనపరెడ్డి సుబ్బారావు, మంగరౌతు రా ము, ఎస్వీఎస్‌ అప్పలరాజు, గాజింగం సత్తి బాబు, అడపా వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:49 AM