మాటామాటా కలిపి.. శారీరక వాంఛ ఎర వేసి..
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:24 AM
అమలాపురం టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఓ రాత్రి వేళ పానీపూరీ బండి వద్ద 60ఏళ్ల సహకార ఉద్యోగితో ఓ మహిళ మాటామాటా కలిపింది. సెక్సువల్‌గా ప్రేరేపించింది. ఓ ఇంటికి తీసుకువచ్చి ఇద్దరు అనుచరులతో మద్యంలో మత్తుబిల్లలు, గడ్డి మందు కలిపి సదరు ఉద్యోగితో తాగించారు. ఆ వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్లగానే నిలువు దోపిడీ చేసి పరారయ్యారు. కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో సదరు ఉద్యోగి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతు

మద్యంలో మత్తుబిల్లులు.. గడ్డిమందు కలిపి తాగించి సహకార ఉద్యోగిని నిలువు దోపిడీ చేసి పరారైన మహిళ
మహిళతో పాటు సహకరించిన ఇద్దరి అరెస్టు
అమలాపురం టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఓ రాత్రి వేళ పానీపూరీ బండి వద్ద 60ఏళ్ల సహకార ఉద్యోగితో ఓ మహిళ మాటామాటా కలిపింది. సెక్సువల్‌గా ప్రేరేపించింది. ఓ ఇంటికి తీసుకువచ్చి ఇద్దరు అనుచరులతో మద్యంలో మత్తుబిల్లలు, గడ్డి మందు కలిపి సదరు ఉద్యోగితో తాగించారు. ఆ వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్లగానే నిలువు దోపిడీ చేసి పరారయ్యారు. కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో సదరు ఉద్యోగి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ కేసు వివరాలను అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు మంగళవారం రాత్రి విలేకర్లకు వివరించారు. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి అల్లవరం మండలంలో ఒకపీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్నాడు. గత నెల 17వ తేదీన సొసైటీ నుంచి రూ.లక్ష నగదు తీసుకుని అమలాపురం వచ్చాడు. ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలో మద్యం సేవించి స్థానిక పానీపూరీ బండి వద్దకు వచ్చాడు. అక్కడే పానీపూరీ తింటున్న కాకినాడ మండలం తూరంగికి చెందిన కుమారి (30) పరిచయమైంది. మాటామాటా కలిపింది. అక్కడి నుంచి వారిద్దరు మోటారుసైకిల్‌పై బండారులంక వైపు వెళ్లారు. వారి ఏకాంతానికి సరైన ప్రదేశం లభించలేదు. దాంతో ఆ మహిళ అమలాపురంలో తనకు తెలుసున్న స్నేహితుని ఇల్లు ఉందని చెప్పి నమ్మించింది. ఇద్దరూ కలిసి అమలాపురం నారాయణపేటకు చేరుకున్నారు. ఇందుపల్లి గ్రామానికి చెందిన తుక్కు సుబ్రహ్మణ్యం ఆ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అప్పటికే వారి పథకం ప్రకారం బండారులంక ఎగ్జిబిషన్ వీధికి టి.వెంకటరమణను అక్కడకు రప్పించారు. మద్యం మత్తులో ఉన్న సొసైటీ ఉద్యోగిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. మద్యంలో తొలుత మత్తు బిల్లలు కలిపి ఇచ్చారు. అప్పటికీ ఉ ద్యోగి అలాగే ఉండడంతో వెంకటరమణ పథకం ప్రకారం గడ్డి మందును సిద్ధం చేసి ఉంచాడు. తొలుత కూల్‌డ్రింక్‌లో కొద్దిగా గడ్డిమందు కలిపి సహకార ఉద్యోగితో తాగించారు. ఈ తరువాత మద్యంలో గడ్డి మందు కలిపి తాగించడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే వారు ఉద్యోగి జేబులో ఉన్న రూ.లక్ష నగదుతో పాటు అతడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని అపహరించుకుని పరారయ్యారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉద్యోగికి మెలకువ రాగా మోసపోయానని గుర్తించి ఎక్కడ పరువు పోతుందోనని ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంటికి చేరుకున్నాడు. గడ్డి మందు తాగించడంతో అనారోగ్యం పాలవ్వగా ఇంటి వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నాడు. అంతకంతకు బాధ ఎ క్కువ కావడంతో కుటుంబ సభ్యులు గత నెల 26న నిలదీశారు. అప్పుడు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకుని అదేరోజున ఫిర్యాదు చేశారు. సీఐ వీరబాబు ఆధ్వర్యంలో హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తూరంగికి చెందిన కుమారితో పాటు ఆమెకు సహకరించిన సుబ్రహ్మణ్యం, వెంకటరమణను మంగళవారం అరెస్టు చేసి వారి నుంచి బంగారు ఉంగరం, రూ.45వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హజరుపరుచగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా తీవ్ర అనారోగ్యానికి గురైన సహకార ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో వైద్యసేవలు పొందుతున్నాడు.