Pulivendula : వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:15 AM
అనారోగ్యంతో మరణించిన వైఎస్ అభిషేక్‌రెడ్డి భౌతికకాయం వద్ద మాజీ సీఎం జగన్ దంపతులు నివాళులు అర్పించారు.
పులివెందులలో జగన్ దంపతుల నివాళి
పులివెందుల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మరణించిన వైఎస్ అభిషేక్‌రెడ్డి భౌతికకాయం వద్ద మాజీ సీఎం జగన్ దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలను పులివెందులలో పూర్తిచేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పెదనాన్న మనవడైన అభిషేక్ రెడ్డి వైసీపీ వైద్యవిభాగ రాష్ట్ర కార్యదర్శిగా, గత సార్వత్రిక ఎన్నికల్లో లింగాల మండల వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మృతిచెందారు. అదేరోజు రాత్రి అభిషేక్‌రెడ్డి భౌతికకాయాన్ని పులివెందులలోని అంబకపల్లె రోడ్డులోని స్వగృహానికి తీసుకువచ్చారు. శనివారం మధ్యాహ్నం మాజీ సీఎం జగన్, భారతీ దంపతులు బెంగళూరు నుంచి పులివెందుల వచ్చారు. అభిషేక్‌రెడ్డి భార్య సౌఖ్య, కుమార్తెలు అక్షర, ఆకర్ష.. అభిషేక్ తండ్రి వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, తాత వైఎస్ ప్రకాశ్‌రెడ్డిలను జగన్ ఓదార్చారు. పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉదయం అభిషేక్‌రెడ్డి స్వగృహానికి వెళ్లి నివాళులు అర్పించారు.
Updated Date - Jan 12 , 2025 | 06:15 AM