Share News

Vontimitta Pushpayagam: ఒంటిమిట్టలో వైభవంగా పుష్పయాగం

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:53 AM

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం కోదండరామునికి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు 2.5 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు

Vontimitta Pushpayagam: ఒంటిమిట్టలో వైభవంగా పుష్పయాగం

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం కోదండరామునికి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం ధ్వజావరోహణతో ముగిశాయి. మంగళవారం రాత్రి సీతాలక్ష్మణ సమేత కోదండరాముడికి పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 2.5 టన్నుల పుష్పాలు భక్తులు విరాళంగా అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో గాని, నిత్యకైంకర్యాల్లో తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. కంకణభట్టార్‌ రాజేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు.

Updated Date - Apr 16 , 2025 | 05:53 AM