Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:08 PM
సింగపూర్‌లోని రివర్ వ్యాలీలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు అవ్వగా.. ఓ బాలుడు మృతిచెందాడు.

అమరావతి: జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. సింగపూర్‍లో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలుసుకుని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి ధైర్యం చెప్పారు. సింగపూర్‌లో ఎటువంటి సహాయం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని పవన్‍కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
కాగా, సింగపూర్‌లోని రివర్ వ్యాలీలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు అవ్వగా.. ఓ బాలుడు మృతిచెందాడు. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో డిప్యూటీ సీఎం కుమారుడితోపాటు అందిరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో కుమారుడు మార్కు శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మెుత్తం 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. దురదృష్టవశాత్తూ ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. మార్క్ శంకర్‌కి ఎలాంటి ప్రాణాపాయం లేదు. కుమారుడి ప్రాణాలు కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మార్కు శంకర్‌కి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మూడ్రోజులపాటు వైద్యం కొనసాగాల్సిన అవసరం ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని ఆరా తీశారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి రాయబారి కార్యాలయ హైకమిషనర్‌తో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని మోదీ కోరుకున్నారు. కష్ట కాలంలో పవన్‌కు అండగా నిలిచిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పవన్ కల్యాణ్, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు. మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..
Attack On jagan Helicopter: రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. పార్టీ అధినేత హెలికాఫ్టర్‌పైనే దాడి..