Temperature: మండిన రాయలసీమ

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:12 AM

రాష్ట్రంపైకి వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.

Temperature: మండిన రాయలసీమ
  • నంద్యాలలో దేశంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత

  • ఆత్మకూరులో 40.9 డిగ్రీలు నమోదు

  • నేడు 143 మండలాల్లో వడగాడ్పులు

విశాఖపట్నం, అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపైకి వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. బుధవారం రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. కోస్తాలో కూడా ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం నెలకొంది. బుధవారం దేశంలోనే నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో 40.9, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 40, కృష్ణా జిల్లా కంకిపాడులో 39.9 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, సీమల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 06 , 2025 | 04:12 AM