Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి
ABN, Publish Date - Mar 28 , 2025 | 04:00 AM
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని 18 ఏళ్ల బాలిక నాగ భవ్యకు బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు చాలా ఖర్చులు అయ్యాయి. తల్లిదండ్రులు, ప్రజల సహాయం కోరుతున్నారు
బ్లడ్ క్యాన్సర్‌తో ఇంటర్ విద్యార్థి పోరాటం
రోజురోజుకూ మృత్యు ఒడికి చేరుతున్న వైనం
సాయం కోరుతున్న నిరుపేద తల్లిదండ్రులు
నరసరావుపేట కల్చరల్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఆడి పాడే వయసులో ఆ బాలికను క్యాన్సర్ మహమ్మారి కబళించేస్తోంది. రోజురోజుకూ మృత్యువుకు దగ్గరవుతున్న ఆ చిన్నారి ‘అమ్మా.. నన్ను బతికించండి..’ అంటూ దీనంగా అడుగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని దీనంగా వేడుకుంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం నవోదయనగర్‌లోని కాశీరత్నం పాఠశాల వద్ద రాజు, నాగ సుధారాణి దంపతులు కిరాణా దుకాణంలో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. కొడుకు ఇంజనీరింగ్ చదువుతుండగా, కూతురు నాగ భవ్య ఇంటర్ చదువుతోంది. గతేడాది ఫిబ్రవరిలో భవ్యకు బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. విజయవాడలోని హెచ్‌సీజీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఏడాదిగా చికిత్స చేయిస్తున్నారు. చికిత్స కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి రూ.పది లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు. ఆరోగ్యశ్రీ ద్యారా వచ్చిన డబ్బు సరిపోలేదు. ఇమ్యూనోథెరపీ చేస్తే వ్యాధి నయమవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. కానీ, ఇప్పటికే వారు తాహతుకు మించి ఖర్చుచేసి కట్టుబట్టలతో మిగిలారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం, దాతలు ఆర్థిక సాయం చేస్తే తమ బిడ్డను కాపాడుకుంటామని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. సాయం చేయదలచిన దాతలు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతా నంబరు 018210 100160798 (ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్: యూబీఐఎన్ 0801828), లేదా 8340018983, 81791692153 ఫోన్ నంబర్లలో సంప్రదించి గూగుల్ పే ద్వారా సాయం చేయాలని కోరుతున్నారు.
For More AP News and Telugu News
Updated Date - Mar 28 , 2025 | 04:00 AM