Sankranti Event : సంక్రాంతి సంబరాల్లో ఈగల్ చీఫ్ రవికృష్ణ
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:04 AM
ఫ్యాక్షన్ గడ్డ కప్పట్రాళ్లలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ‘ఈగల్’ విభాగం చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ సందడి చేశారు.

దేవనకొండ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఫ్యాక్షన్ గడ్డ కప్పట్రాళ్లలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ‘ఈగల్’ విభాగం చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ సందడి చేశారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో ఆయన ప్రతి ఏటా పాల్గొంటారు. శనివారం జరిగిన సంబరాలకు రవికృష్ణ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఆయనకు గ్రామ ప్రజలు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా రవికృష్ణ స్థానిక యువకులతో కలసి కబడ్డీ, బ్యాడ్మింటన్, స్లో సైక్లింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ముగ్గుల పొటీలను ఆసక్తిగా తిలకించారు.
Updated Date - Jan 12 , 2025 | 06:04 AM