Jagan Betrays Minorities: మైనార్టీలకు జగన్ మోసం
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:58 AM
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లుపై వైసీపీ ప్రవర్తనను మోసం అని అభివర్ణించారు

రాజ్యసభలో వక్ఫ్‌బిల్లుకు మద్దతు
ఆపై సిగ్గులేకుండా సుప్రీంలో కేసా?: ముస్తాక్ అహ్మద్
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మైనార్టీలను మభ్యపెట్టి మోసం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, కానీ అది కుదరని పని అని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లును వైసీపీ ఎంపీలు లోక్‌సభలో వ్యతిరేకించి, రాజ్యసభలో మద్దతుగా ఓటేశారని అహ్మద్ తెలిపారు. గతంలో ఎన్డీయేకు మద్దతు అవసరం లేకున్నా సీఏఏ, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి మైనార్టీ వ్యతిరేక బిల్లులకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఇప్పుడు సిగ్గు లేకుండా వక్ఫ్ సవరణ చట్టంపై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లి ముస్లిలను మోసం చేస్తోందని మండిపడ్డారు.